వైద్య, ఆరోగ్య శాఖలో ఫిబ్రవరి 1 నుంచి చేపట్టనున్న ఉద్యోగుల బదిలీల అంశంలో ఏపీ ప్రభుత్వం స్పల్ప మార్పులు చేసింది. బదిలీలకు సంబంధించి పలు నిబంధనలను పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయా నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ శనివారం మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఉద్యోగులు బదిలీ కోరుకునే 3 ప్రాంతాలను మాత్రమే పేర్కొనేందుకు అవకాశం ఇవ్వగా, ఇప్పుడు వాటిని 20 ప్రాంతాలకు పెంచారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ నాటికి పనిచేస్తున్న చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను తప్పనిసరిగా బదిలీ చేయాలని గత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజాగా ఆ తేదీని ఫిబ్రవరి 7 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకునే వారిని కూడా చేర్చారు. ఉద్యోగులు ఫిబ్రవరి 7వ తేదీ నాటికి బదిలీ దరఖాస్తులు సమర్పించాలని గత ఉత్తర్వుల్లో పేర్కొనగా.. దాన్ని ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగించారు. దరఖాస్తుల పరిశీలన తేదీని ఫిబ్రవరి 18 వరకు పెంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa