గుంటూరు: ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం ఓ పూరింటి దహనానికి దారితీసింది. ఈ ఘటన చేబ్రోలు మండలంలోని వడ్లమూడిలో జరిగింది. ఎస్సై కోటేశ్వరరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాల శ్రీను, నారాయణల మధ్య వివాదం ఏర్పడి, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఇద్దరూ తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతూ చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గత అర్ధరాత్రి శ్రీనుకు చెందిన పూరిపాకకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పాక, అందులోని ద్విచక్రవాహనం కాలిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa