ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సుకెక్కిన తెనాలి విద్యార్థిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 01:46 PM

గుంటూరు: తెనాలి పట్టణ శివారులోని జేఎంజే మహిళా కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న దావులూరి హర్షితకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే చాలా ఇష్టం. సొంతగా సాధనచేస్తూ చక్కటి చిత్రాల ద్వారా పాఠశాల, ఇంటర్‌ స్థాయిల్లో అనేక పోటీల్లో సత్తా చాటి బహుమతులు అందుకుంది. కొన్ని నెలల నుంచి క్రేజీ ఆర్ట్స్‌ 56 పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆవిష్కరణలను పోస్టు చేస్తోంది. సాధారణ బొమ్మలే కాకుండా ఏదో ఒక వస్తువు తీసుకుని, దాన్ని చిత్రకళకు అనుసంధానించడం ద్వారా కొత్తగా ప్రయత్నిస్తోంది. ఈ తరహా బొమ్మలు వేలాది మందిని ఆకట్టుకున్నాయి. తాజాగా 4. 6 సె. మీ. ఎత్తు, 5 సె. మీ. వెడల్పున్న చిన్న రాయిపై ‘క్షీరసాగర మథనం’ చిత్రాన్ని 15 నిముషాల్లో ఆవిష్కరించి, ఆ వీడియోతో పాటు ఇతర చిత్రాలను ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’కు పంపింది.


వారు వాటిని హర్షిత పేరుతో తమ పుస్తకంలో నమోదు చేస్తూ ధ్రువపత్రాన్ని పంపారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో దూసుకుపోతున్న ఈమెను కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు అభినందించారు. పీజీ కూడా పూర్తి చేసి, గ్రూప్‌ పరీక్షలు రాసి, ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమంటున్న ఈమె స్వగ్రామం కొల్లూరు మండలం క్రాప. తల్లిదండ్రులు హేమలత, నాగయ్యలు కౌలు రైతులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa