ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాట తప్పిన ముఖ్యమంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 02:08 PM

విశాఖపట్నం జిల్లా వి మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం తంగుడుబిల్లి గ్రామంలో మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పి వి జి కుమార్ ఆదివారం గౌరవ సభ నిర్వహించారు. పీవీజీ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. ఓ టి ఎస్ పథకం పేరు చెప్పి డోక్రా మహిళల పొదుపు సంఘాల నుండి నగదు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని దీనిపై మహిళలంతా తిరుగుబాటు చేయాలన్నారు. నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని గోతుల్లో తట్టెడు మట్టి వేసే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సన్యాసినాయుడు, పేరుపు కొండబాబు, జెర్రిపోతుల జగ్గారావు, గంగరాజు తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa