వ్యోమగాములకు అనేక సవాళ్లు ఉన్నాయి. అంతరిక్షంలోకి వెళ్లడం మనం అనుకున్నంత సులభం కాదు. ఇది అనేక సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా వినియోగించే వస్తువులు, ధరించగలిగే బట్టలు, తినదగిన ఆహార పదార్థాల వరకు ప్రతిదానిపై పరిమితులు ఉన్నాయి. వాటిమీద నిత్యం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా నాసా చేసిన ఓ ప్రకటన అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. దీనిపై నాసా చీఫ్ ఆఫ్ స్టాఫ్ జిమ్ మాట్లాడుతూ వ్యోమగాములకు అవసరమైన ఆహారాన్ని తయారు చేయడంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇది దీర్ఘకాలిక అధ్యయనం అని ప్రస్తుతం వ్యోమగాములు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలనే తింటున్నారని చెప్పారు. అవి ఎటువంటి పోషకాలను కలిగి ఉండవని ఆయన తెలిపారు. వ్యోమగాములు అక్కడ చాలా తక్కువ రకాల ఆహారాన్ని మాత్రమే తినగలరు. దీన్ని మార్చడానికి, వ్యోమగాముల ఆహారంలో ఆవిష్కరణలు చేసే వారికి దాదాపు 7.4 కోట్ల రూపాయల (1 మిలియన్ డాలర్లు) గ్రాంట్‌ను NASA ప్రకటించింది. 'డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్' పేరుతో దీన్ని ప్రారంభించింది. దీని ప్రకారం వ్యోమగాములకు పౌష్టికాహారం, వినూత్నమైన దీర్ఘకాలం పాటు పాడైపోని ఆహారాన్ని అందించాలి. దీని కోసం అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొన్న వ్యక్తులకు ఈ డబ్బు ఇస్తామని నాసా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గతేడాది అక్టోబరులో కూడా ఇలాంటి పోటీనే నిర్వహించారు. అప్పుడు దాదాపు 18 మంది గెలిచారు. వారికి $450,000 ఇవ్వబడింది. వారి అత్యుత్తమ కృషికి గానూ ఈ అవార్డు లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa