ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు.. టీడీపీ నాయకుడి అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 03:12 PM

లైంగిక వేదిపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కలకలం రేపుతోంది. టీడీపీ నేత వినోద్ జైన్ అనే వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాలిక మృతికి ముందు సూసైడ్ నోట్ రాసింది. నోట్ ఆధారంగా ఫోక్సో కేసు నమోదు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. గత 2 నెలలుగా బాలికను వేధిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బాలిక నిన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కాగా చిన్నారి మృతదేహాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. మార్చురీ దగ్గర బాలిక తల్లిదండ్రులను మంత్రి పరామర్శించారు. ఇదిలాఉంటే.. గత ఎన్నికల్లో టీడీపీ కార్పొరేటరుగా పోటీ చేసి వినోద్ ఓడిపోయినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. వినోద్ జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa