విజయనగరం: సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం కేసలి గ్రామం వద్ద గల పెద్దగెడ్డ రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు ఆదివారం రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స మాట్లాడుతూ. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతని అన్నారు. అహర్నిశలు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని కొనియాడారు. జిల్లాలో సాగునీరు కొరత తీర్చేందుకు జిల్లాలో గల సర్దార్ గౌతు లచ్చయ్య రిజర్వాయర్ పనులను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు సాగునీటి కొరత తీర్చేందుకు తోటపల్లి 1 రిజర్వాయర్ పనులను 120 కోట్ల రూపాయలతో శనివారం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్ద గడ్డ రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు 28. 18 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేపట్టేందుకు సన్నద్ధమైనట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్యేయమని నొక్కివక్కాణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa