ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్లమలలో పెరిగిన పులుల సంచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 04:03 PM

ప్రకాశం జిల్లా ప్రాంతం లోని నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో పులుల సంచారం పెరిగిపోయిందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గతంలో పెద్దగా కనిపించని పులులు గత నాలుగు సంవత్సరాలుగా తరచుగా ఏదో ఒక ప్రాంతంలో దర్శనమిస్తున్నాయి.


ఇటీవల గిద్దలూరు, నంద్యాల పరిసర ప్రాంతాలలో రైల్వే ట్రాక్ పై పులులు మృతి చెందడం కూడా మనం గమనించవచ్చు. అలానే అర్ధవీడు మండలం లోని అటవీ ప్రాంతంలో పులులు ఆవులపై దాడి చేసి చంపిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇక ఎర్రగొండపాలెం, శ్రీశైలం, దోర్నాల ప్రాంతాలలో ఇటీవల పలువురికి పెద్ద పులులు దర్శనమిచ్చాయి.


గతంలో ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో పులులు కనిపించేవి కాదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇటీవల అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా నీరు పుష్కలంగా లభిస్తూ ఉండడం వల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న జీవరాశులకు ఇబ్బంది లేకుండా పోయిందని దీంతో సంతాన ఉత్పత్తి కూడా పెరిగిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.


ఇక అంతే కాదు, పులులతో పాటు విష సర్పాలు కూడా బాగా పెరిగాయని అంటున్నారు అటవీ ప్రాంతం సమీపంలో నివసిస్తున్న ప్రజలు. ఏది ఏమైనా పులులు అంతరించి పోతున్నాయని ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తూ వచ్చారు. అందువల్ల కూడా పెద్దపులుల సంఖ్య పెరిగిందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని ప్రాంతాలలో పులులు సంచరిస్తుండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


ఇలా ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాలలో కూడా పులుల సంచారం అధికంగానే పెరిగిపోయిందని చెప్పాలి. అటవీ సమీప ప్రాంత సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అడవులను సంరక్షిస్తున్న అటవీశాఖ అధికారులు పులుల సంచారం పెరిగిపోయిన విషయాన్ని గుర్తించి అవి ప్రజలలోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa