ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రెండో సీడ్ రఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. మెల్‌బోర్న్‌లోని రాడ్ లావర్ ఎరీనాలో జరిగిన ఫైనల్లో నాదల్ 2-6, 6-7, 6-4, 6-4, 7-5తో రష్యాకు చెందిన డేనియల్ మెద్వెదేవ్‌ను ఓడించాడు.తొలి రెండు సెట్లు ఓడిపోవడంతో నాదల్ ఓటమి తప్పదని అందరూ భావించినా వరుసగా నాదల్ మూడు సెట్లు గెలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో నాదల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa