సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. ఎస్మా చట్టం అమలు చేస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈరోజు శ్రీకాకుళం ఎన్జీవో హోంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించే వరకు పోరాటం ఆగదని అయన తెలిపారు. మంత్రుల కమిటీతో చర్చలకు ఉద్యోగులు ముందుకు రాకపోవడంతో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొప్పరాజు ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa