ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన.... టీడీపీ నేతలపై రోజా ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 09:11 PM

విజయవాడలో మైనర్ బాలిక ఆత్మహత్య ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతపై మండిపడ్డారు. విజయవాడకు చెందిన టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులతో భవానీపూర్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక  ఆత్మహత్య చేసుకుందనే వార్త వినడం బాధాకరమన్నారు. ‘‘ప్రజా ప్రతినిధిగా  పద్నాలుగేళ్ల చిన్నారిని తండ్రిలా చూడాలి కానీ.. ఇలా లైంగికంగా వేధించడం ఎంతవరకు సమంజసం? అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa