ట్రెండింగ్
Epaper    English    தமிழ்

108 లో మహిళ ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 01:14 PM

కృష్ణా జిల్లా: మోపిదేవి 108 ఆంబులెన్స్ లో ప్రసవించింది. మోపిదేవి మండలం మేళ్లమర్రు గ్రామానికి చెందిన చుక్క మౌనిక, (భర్త రాజేష్)కి పురిటి నొప్పులు రావడంతో 108కి సోమవారం ఉదయం ఫోన్ చేశారు. దగ్గర్ లో ఉన్నటువంటి మోపిదేవి ఆంబులెన్స్ ఆ గ్రామానికి చేరుకొని డిస్ట్రిక్ గవర్నమెంట్ మచిలీపట్నానికి తీసుకువస్తుండగా, నేషనల్ హైవే 216 మార్గంమధ్యలో అంబులెన్స్ లో ఈ ఎంటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చిలకూరి వెంకటనర్సయ్య, పైలెట్ డ్రైవర్ భూపతి దిలీప్ బాబు సారథ్యంలో ఎంతో శ్రమపడి మొదటి కాన్పు సుఖ ప్రసవం చేయడం జరిగింది. ఆడపిల్ల జన్మనివ్వడం జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. తదనంతరం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బంధుమిత్రులు ప్రజానీకం, డిస్ట్రిక్ మేనేజర్ సురేష్ కుమార్, అలాగే డివిజినల్ అధికారి హస్మతుల్లా అభినందించడం జరిగింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa