అనంతపురం: గుత్తి మండలం టి. కొత్తపల్లి గ్రామ మలుపు వద్ద సోమవారం 67వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. గుత్తి వైపు నుంచి వెళ్తున్న కంటైనర్ తాడిపత్రి వైపు నుంచి వస్తున్న ఐచర్ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐచర్ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa