ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి కరోనా రోగి...వూహన్ కు పయనం

national |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 03:40 PM

కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న వూహన్ కు భారతదేశంలోని తొలి కరోనా రోగి వెళ్లేందుకు సిద్దమవుతోంది. భారత్‌లో తొలి కరోనా రోగిగా గుర్తింపు పొందిన కేరళలోని త్రిసూర్‌కు చెందిన యువతి.. మహమ్మారి వెలుగుచూసిన చైనాలోని వూహాన్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఎంబీబీఎస్ పూర్తిచేసి వైద్యురాలై తన చిన్ననాటి కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకుంది. సెమిస్టర్ సెలవుల నేపథ్యంలో 2020 జనవరి చివరి వారంలో భారత్ చేరుకున్న యువతికి అదే నెల 30న నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆ తర్వాతి రోజు ఆసుపత్రిలో చేరింది. అంటే భారత్‌లో కరోనా అడుగుపెట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. ఈ ఘటన తర్వాత అటు వూహాన్‌తోపాటు ప్రపంచమంతా వైరస్ పాకిపోయింది. దీంతో చైనా కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేసింది. ఫలితంగా కేరళ యువతి అప్పటి నుంచి ఇంటి వద్దే ఉండిపోయింది. ఆన్‌లైన్ ద్వారా ఎంబీబీఎస్ పూర్తిచేసింది. అయితే, ఎంబీబీఎస్ పట్టా అందుకోవాలంటే భారత్‌లో హౌస్ సర్జన్‌కు సమానమైన 52 వారాల ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆమె చైనా వెళ్లడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో తిరిగి వూహాన్ వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది. కొవిడ్ ప్రస్తుతం నియంత్రించగలిగే స్థాయిలోనే ఉందని, కాబట్టి వూహాన్‌లో చదువుకుంటున్న వందలాదిమంది విద్యార్థులు చైనా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, చైనా అధికారులతో మాట్లాడాలని ఆమె తండ్రి కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa