తూర్పు గోదావరి: ఆత్రేయపురం మండలంలోని మెర్లపాలెంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. గ్రామంలో పేకాట ఆడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 25, 290 స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జి ఎస్సై బెన్నిరాజు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa