ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాలలో అదనపు కట్నం కోసం వేధింపులు. కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 10:00 AM

అదనపు కట్నం కోసం భార్యను వేధించటమే కాకుండా ఆమె ఇంటికి వెళ్లి బంధువులపై దాడి చేసిన సంఘటన నంద్యాలలో పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని స్థానిక టూటౌన్ సీఐ రమణ తెలిపిన వివరాల మేరకు. ఎస్బీఐ కాలనీకి చెందిన దివ్యవాణిని కర్నూలు జిల్లాకు చెందిన సునీల్ కుమార్ గత ఏడాది వివాహం చేసుకున్నాడు.వివాహం సమయంలో సునీల్ కు రూ. 8 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. అయితే కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటంతో అప్పటికే నెలలు నిండిన దివ్యవాణి పుట్టింటికి వచ్చి పురుడు పోసుకుంది.అదనపు కట్నం కావాలని సునీల్ తన స్నేహితులతో ఆదివారం రాత్రి దివ్యవాణి ఉంటున్న ఇంటికి వచ్చి బంధువులపై దాడి చేశారు. దీంతో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa