ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ అభివృద్ధి మీద నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 12:21 PM

దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం.  75వ వడిలోకి వచ్చిన భారత్‌కు వందేళ్ల అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. వందేళ్ల భారతానికి ప్రధాని మోదీ ఒక మిషన్‌ రూపొందించారు.. దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. ఎయిరిండియా బదిలీని సంపూర్ణం చేశాం. పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించాం. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించాం. ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉ‍ద్యోగాల కల్పనకు ప్రణాళిక రూపొందించాం. పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. పేద వర్గాలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, వ్యవసాయ దారులకు సముచిత స్థానం కల్పిస్తున్నాం. కొవిడ్‌ మహమ్మారి తర్వాత భారత్‌ వేగంగా కోలుకుంది. వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది. వృద్ధిరేటులో మనం ముందున్నాం. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపొందించాం. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ హయాంలో 10 వ బడ్జెట్‌, నిర్మలకు నాలుగో బడ్జెట్. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa