కృష్ణా జిల్లా పెడనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన జీవన్ ప్రసాద్ అనే వ్యక్తి వద్ద పద్మనాభం కుటుంబం మూడు లక్షల మేర అప్పు తీసుకుంది. కాగా 3 లక్షలకు గాను 4.50 లక్షల అధిక వడ్డీకి ఒత్తిడి చేసి నోట్లు, అగ్రిమెంట్ నోటరీ చేయించి కుటుంబంపై జీవన్ ప్రసాద్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. బెదింపులకు పాల్పడటంతో మనస్థానికి గురైన చేనేత కుటుంబం ఆత్మహత్యకు సిద్ధపడింది. యజమాని కాశం పద్మనాభం, భార్య నాగ లీలావతి, కొడుకు రాజా నాగేంద్రం ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పెడన సీఐ వీరయ్య గౌడ్, ఎస్ఐ టీ.మురళి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహలు పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa