విశాఖ నగరంలో ఓ వైపు డ్రగ్స్ దిగుమతి అవుతుండగా. ఇక్కడ నుంచి గంజాయి ఎగుమతి అవుతోంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా స్మగ్లర్లు పోలీసుల ఎత్తుకు పై ఎత్తు ఆలోచిస్తూ వీటిని ఎలాగోలా సరిహద్దులు దాటిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో వేలాది ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం ప్రక్రియ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా గంజాయి తరలిస్తున్న వారిపై నిఘా పెడుతూ అరెస్టులూ చేస్తున్నారు. అయినా సరే మన్యం సరిహద్దులు దాటి గంజాయి నగరంలోకి అడుగుపెడుతోంది. దొరికితే దొంగ. దొరకకపోతే దొర అన్నట్టు స్మగ్లర్లు తెగించారు. అందుకే గంజాయి గప్పుమంటోంది. ఇక హైదరాబాద్ కేంద్రం విశాఖకు డ్రగ్స్ దిగుమతి అవుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి డ్రగ్స్‌తో హైదరాబాద్‌నుంచి విశాఖ రావడం. డ్రగ్స్‌తో పాటు పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌తో విశాఖ అనుబంధం ఏనాడు నుంచో ఉంది. మెట్రోపాలిటిన్ సిటీగా పేరొందిన విశాఖలో చాపకింద నీరులా డ్రగ్స్ లభ్యమవుతున్నాయన్నది అందిరికీ తెలిసిందే. దీనిపై పోలీసులు సీరియస్ దృష్టి పెట్టారు. ఎవర్నీ వదలబోమని స్పష్టం చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్ లభ్యమయ్యే ప్రాంతాలు. వ్యక్తులపై ఇప్పటికే నిఘా పెట్టారు. నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా స్పష్టమైన ఆదేశాల మేరకు పోలసు యంత్రంగం మొత్తం ఈ వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa