ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో విశాఖకు చెందిన యువకుడు మనస్తాపానికి గురై పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో సోమవారం చోటు చేసుకుంది. ఈనాడు కథనం ప్రకారం..విశాఖ జిల్లా కశింకోటకు చెందిన అంజాల రవికిరణ్ (35) పెద్దాపురంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. పదేళ్ల నుంచి అనకాపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో మనస్థాపం చెంది పురుగు మందు తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కాకినాడ జీజీహెచ్ లో చేర్చారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa