10 అడుగుల దోశ తింటే 71వేల ప్రైజ్ మనీ ఇస్తోంది ఓ రెస్టారెంట్. ఈ పొడవైన దోశను తినాలంటే ఢిల్లీలోని బిందాపుర్‌లోని శక్తి సాగర్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. వారంతాల్లో కుటుంబ సభ్యులతో వచ్చే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ దోశను తయారు చేశారు రెస్టారెంట్ నిర్వాహకులు. 15 వందల రూపాయలకు ఈ దోశ దొరుకుతుంది. అయితే ఈ దోశను ఒక్కరే తింటే ప్రైజ్ మనీ ప్రకటించింది. ఇలా తిన్న వారికి 71వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa