దేశంలో కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ఇప్పుడిప్పుడే స్కూళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకొంటున్నాయి. ఇంకా కొందరు తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల్ని బడులకు పంపేందుకు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్కూళ్ల పునఃప్రారంభంపై పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
మార్గదర్శకాలు:
- స్కూళ్లను, చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూడాలి.
- పిల్లల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలి.
- సిబ్బంది గదులు, ఆఫీస్ ఏరియా, అసెంబ్లీ హాల్, ఇతర ప్రాంతాల్లో భౌతికదూరం పాటించేలా చూడాలి.
- భౌతిక దూరం పాటించడం సాధ్యం కాకపోతే స్కూల్ ఈవెంట్ లు నిర్వహించకూడదు.
- అందరూ మాస్కులు ధరించాలి. మధ్యాహ్న భోజనం అందించేటప్పుడు భౌతికదూరం పాటించాలి.
- హాస్టళ్లలో పిల్లల బెడ్ ల మధ్య దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- స్కూల్ బస్సులు, వ్యాన్ ల డ్రైవర్లు భౌతికదూరం పాటించాలి. బస్సుల్లో విద్యార్థులు దూరంగా ఉండేలా చూడాలి.
- పిల్లల్ని స్కూల్ కి పంపాలా? ఆన్ లైన్ తరగతుల వైపే మొగ్గు చూపాలా అనే నిర్ణయం తల్లిదండ్రులకే వదిలేయాలి.
- ఇల్లులేని, వలస కూలీల పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులపై, కరోనా బారిన పడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa