ఓ డెలివరీ బాయ్ కల్నాల్ ప్రాణాలను కాపాడి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ముంబైలో కల్నల్ మోహన్ మాలిక్ అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్ 25న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన కొడుకు లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వారి కారు ఆగిపోయింది. దాంతో కల్పల్ మాలిక్ కుమారుడు కిందకు దిగి తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడ బైక్‌లపై ఉండే వాహనదారులను సహాయం కోరాడు. కానీ ఎవరూ సాయం చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ మృనాల్ మాత్రం సాయం చేశాడు. కల్నల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దాంతో ఆయన ప్రాణాలు నిలిచాయి.ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న రిటైర్డ్ కల్నల్ మాలిక్ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ మృనాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. "చాలా వారాల తర్వాత, నేను క్షేమంగా ఉన్నాను. నాకు కొత్త జీవితాన్ని అందించిన యువకుడి గురించి ఆలోచించాను. నాకు అతను నిజంగా రక్షకుడు , అతను లేకుంటే నేను బహుశా నా ప్రియమైన వారి వద్దకు తిరిగి రాలేపోయేవాడిని’’అని అన్నారు.అ అయితేదీనికి సంబంధించిన వీడియోను డెలివరీ వెబ్‌సైట్ స్విగ్గీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో డెలివరీ బాయ్ మృనాల్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సోమవారం స్విగ్గీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా దాదాపు 3,500కు పైగా లైక్స్ వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa