ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రకు చెందిన మరో బ్యాంకు దివాలా.,. లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ

national |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 03:17 AM

బ్యాంకులు దివాళా తీయడం కొత్తేమి కాదు. తాజాగామ మహారాష్ట్రకుచెందిన ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌ లైసెన్సును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రద్దు చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాలను సీజ్ చేస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. నేటి నుంచే అంటే ఫిబ్రవరి 3, 2022 నుంచే ఇది అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. గురువారం దీనిపై ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, తాము గతేడాదినే కొన్ని ఆంక్షలు విధించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరు నెలల వరకు కస్టమర్లు మనీని విత్‌డ్రా చేసుకోవడానికి వీలులేకుండా పోయింది. ఆంక్షల విధించినా కూడా బ్యాంకు వ్యాపార కార్యకలాపాల పరిస్థితి మెరుగుపరుచుకోలేకపోవడంతో.. లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకు వద్ద సరిపోయే మూలధనం లేదని ఆర్‌బీఐ పేర్కొంది. భవిష్యత్‌లో ఆదాయాలు వచ్చే మార్గం కూడా లేదని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్ల, డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో గల ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్సును రద్దు చేసిన విషయాన్ని ఆర్‌బీఐ సంబంధిత డిపార్ట్‌మెంట్, అధికారులకు తెలియజేసింది. నిబంధనల కింద కస్టమర్ల డిపాజిట్లను వెనక్కి ఇచ్చే చర్యలను చేపట్టాలని బ్యాంకును ఆర్‌బీఐ ఆదేశించింది. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం, రూ.5 లక్షల వరకున్న డిపాజిట్లను కస్టమర్లకు వెనక్కి ఇచ్చేయాలి. బ్యాంకు డేటా ప్రకారం, రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ మనీ డిపాజిట్ చేసిన 99 శాతం అకౌంట్ హోల్డర్లకు పూర్తి మనీ రీఫండ్ అవుతుంది. ఆర్‌బీఐ రద్దు నిర్ణయం కేవలం 1 శాతం కస్టమర్లపైనే ప్రభావం చూపనుంది. కస్టమర్లు గరిష్టంగా రూ.5 లక్షల వరకు తిరిగి పొందనున్నారు. అంతకంటే ఎక్కువ క్లయిమ్ చేసుకోలేరు. ఆర్‌బీఐకి బ్యాంకు సమర్పించిన డేటా ప్రకారం జనవరి 27, 2022 వరకు బ్యాంకు తన కస్టమర్లకు రూ.2.36 కోట్లను వెనక్కి ఇచ్చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa