ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూముల రిజిస్ట్రేషన్ కు ప్రత్యేక ఆధార్ నెంబర్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 03:19 AM

వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్రొగ్రామ్ కింద, కేంద్ర ప్రభుత్వం 2023 నాటికి అన్ని భూములను డిజిటల్‌గా రికార్డు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం, ప్రతి వ్యవసాయ, ఇతర అన్ని భూములకు యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్-యూఆర్ఎన్‌ను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెంబర్ 14 అంకెలలో ఉండనుంది. ఈ యునిక్ నెంబర్‌తో ఏ వ్యక్తి అయినా తన భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌గా చూసుకోవడమే కాకుండా.. ఆ వివరాలను డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. తమ ల్యాండ్ పేపర్లను తేలికగా పొందవచ్చు. అదేవిధంగా ఈ యూఆర్ఎన్ నెంబర్‌ను ఎన్నో పథకాలను వాడుకోవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్ యోజన) వంటి పలు పథకాలకు ఈ యూఆర్ఎన్ నెంబర్‌ను వాడుకోవచ్చు. దేశంలో  ఉన్న ప్రతి భూమికి సంబంధించి సమాచారాన్ని డిజిటల్ ఫార్మాట్‌లో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్‌ను క్రియేట్ చేస్తుంది. ఈ డేటా అంతా ఈ డిజిటల్‌ పోర్టల్‌లోనే అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టల్‌లో యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నమోదు చేయడం ద్వారా తమ సమాచారాన్ని పొందవచ్చు.. ఈ నెంబర్‌ను భూముల ఆధార్ నెంబర్‌గా పిలుచుకోవచ్చు.వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్ ప్రొగ్రామ్ ద్వారా ప్రభుత్వం డ్రోన్ల సాయంతో భూములను కొలవనుంది. భూములను కొలవడంలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం డ్రోన్ల సాయం తీసుకుంటోంది. ఆ తర్వాత ఈ భూముల వివరాలు ప్రభుత్వ డిజిటల్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే హర్యానా ప్రభుత్వం డ్రోన్ల ద్వారా ఇళ్ల స్థలాలను, గ్రామాలలలో ప్లాట్లను కొలుస్తోంది. డ్రోన్ల వాడకం అక్కడ ఎంతో విజయవంతమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa