ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 01:17 PM

అనంతపురం: తనకల్లు మండల పరిధిలోని పాలెం వాండ్ల పల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (44) అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకున్న విషయం గురువారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేయగా ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన సుధాకర్ తండ్రి వెంకటరమణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అయితే ఇతనికి గత 12 సంవత్సరాలుగా కడుపు నొప్పి ఉందని దాని వలన ఉరి వేసుకొని మృతి చెందినట్లు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇతని మృతి పట్ల కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ రాంభూపాల్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa