ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాపు ఉద్యమ కేసుల ఉపసంహరణ హర్షణీయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 01:09 PM

కృష్ణా జిల్లా: కాపు ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు పాలనలో కాపులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించారని, రిజర్వేషన్‌ కోసం ఉద్యమించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేశాడని మండిపడ్డారు. మహిళలపైనా త‌ప్పుడు కేసులు పెట్టార‌ని ఆరోపించారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కేంద్ర రైల్వే మంత్రితో పలుమార్లు చర్చలు జరిపి. కేసులు ఎత్తివేతకు కృషి చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపులను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. కాపుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాపు కార్పొరేషన్‌ కు అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల మందికి పైగా కాపులు లబ్ధి పొందారని గుర్తుచేశారు. కాపు సామాజికవర్గానికి ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa