ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ వ్యాసాన్ని ట్విట్టర్లో పోస్టు చేయాలనుకుంటున్నారా.. అయితే నో టెన్షన్

international |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 11:21 PM

మీ అభిప్రాయాన్ని క్లుప్తంగా ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నారా... అయితే ఇక మీకు బెంగ అవసరం లేదు. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఆసక్తికర ఫీచర్ తీసుకువస్తోంది. ఈ ఫీచర్ సాయంతో ఎంత పెద్ద వ్యాసాన్నయినా ట్విట్టర్ లో పోస్టు చేయొచ్చు. ఇప్పటివరకు ఉన్న అక్షరాల పరిమితికి ఈ ఫీచర్ తో గుడ్ బై చెప్పేయొచ్చు. మొదట్లో ట్విట్టర్ లో ఒక పోస్టుకు 140 అక్షరాల పరిమితి ఉండేది. 140 అక్షరాలు దాటితే ట్విట్టర్ లో పోస్టు చేయడం కుదరదు. ఆ తర్వాత కాలంలో ఆ పరిమితిని 280 అక్షరాలకు పెంచారు. అయినప్పటికీ ఏదైనా భారీ సమాచారం పోస్టు చేయాలంటే అనేక ట్వీట్లు చేయాల్సి వచ్చేది. అయితే కొత్త ఫీచర్ సాయంతో ఆ బాధ తొలగిపోనుంది. 'ఆర్టికల్స్' పేరుతో ట్విట్టర్ త్వరలోనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. మెనూలో దీనికి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది. అక్షరాల పరిమితికి సంబంధించి ట్విట్టర్ పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు 'ఆర్టికల్స్' ఫీచర్ తో ట్విట్టర్ ఆ విమర్శలు తొలగించుకునే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa