వాట్సప్ ప్రతీ నెలా లక్షల అకౌంట్లను బ్యాన్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షాక్ ఇస్తోంది. గత ఆరు నెలల్లో వాట్సప్ ఏకంగా 1.32 కోట్ల వాట్సప్ అకౌంట్స్‌ని బ్యాన్ చేసింది. 2021 మే 15 నుంచి డిసెంబర్ 31 వరకు వాట్సప్ ఏకంగా 1,52,24,000 అకౌంట్లను బ్యాన్ చేసింది. భారతదేశంలో 40 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉంటారని అంచనా. వారిలో కోటిన్నర అకౌంట్లను వాట్సప్ బ్యాన్ చేయడం చర్చనీయాంశమైంది. ప్రతీ నెలా 20 లక్షలకు పైనే అకౌంట్లపై వాట్సప్ నిషేధం విధిస్తూ వస్తోంది. ఏ నెలలో ఎన్ని అకౌంట్స్ బ్యాన్ చేశామో లిస్ట్ విడుదల చేస్తోంది. అసలు వాట్సప్ ఎందుకు అకౌంట్స్‌పై నిషేధం విధిస్తోంది? అన్న చర్చ యూజర్లలో ఉంది. అయితే భారత ప్రభుత్వం రూపొందించిన సరికొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం వాట్సప్ అకౌంట్లపై నిషేధం విధిస్తోంది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘించినవారిపై నిషేధం విధించి ఆ జాబితాను ప్రభుత్వానికి షేర్ చేస్తోంది వాట్సప్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa