ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేపాక్షి ఆలయంపై రాజ్యసభలో ప్రస్తావన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 12:25 PM

అనంతపురం: ప్రపంచ పర్యాటక చిత్రపటంలో పేరెన్నికగన్న దుర్గా, వీరభద్రస్వామి ఆలయం హెరిటేజ్ హబ్ గా గుర్తించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, గత ఏడాది డిసెంబర్లో లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని శిల్ప, చిత్రకళలు, ఏకశిలా నంది విగ్రహాన్ని సందర్శించి ఆలయాన్ని యునెస్కో గుర్తింపుకు కృషిచేస్తానన్నారు. రెండు రోజుల క్రితం రాజ్యసభలో ఆయన ప్రస్తావించారు. లేపాక్షి దుర్గా వీరభద్రస్వామి ఆలయంను యునెస్కో గుర్తింపుకు పంపేలా వెంటనే ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర టూరిజంశాఖ వ మంత్రి కిషన్రెడ్డి ఆదేశించారు. దీనిపై స్థానిక బీజేపీ నాయకులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. లేపాక్షికి యునెస్కో గుర్తింపు లభిస్తే | ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభలో చర్చించండం హర్షించదగ్గ విషయమని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు, నరసింహమూర్తి ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa