ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెజాన్ సరికొత్త రికార్డ్...ఒక్క రోజులో ఎంతో సంపాధించేసింది

international |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 03:02 PM

అమెజాన్ దశ తిరిగింది. ఒక్క రోజులో ఎవరూ ఊహించని విధంగా సంపాధించేసింది. చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధికంగా రూ.18 లక్షల కోట్లు నష్టపోయి నిన్న ఫేస్ బుక్ వరస్ట్ రికార్డ్ నమోదు చేస్తే.. ఒక్కరోజులోనే అత్యధికంగా సంపాదించి అమెజాన్ ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. అవును, చరిత్రలోనే ఏ కంపెనీ సాధించలేని ఘనతను శుక్రవారం అమెజాన్ చేసి చూపించింది. ఇన్న ఒక్కరోజే అమెరికాలో అమెజాన్ షేర్ విలువ 13.54 శాతం పెరగ్గా.. కంపెనీ విలువ మరో 19,100 కోట్ల డాలర్లు పెరిగింది. అంటే నిన్న ఒక్కరోజే అమెజాన్ సుమారు రూ.14.26 లక్షల కోట్లను ఆర్జించింది. తద్వారా గత వారం యాపిల్ సృష్టించిన 18,100 కోట్ల డాలర్ల (సుమారు రూ.13.51 లక్షల కోట్లు) రికార్డును అమెజాన్ బద్దలు కొట్టింది. సంస్థ షేర్ విలువలో ఏడేండ్లలోనే నిన్న భారీ పెరుగుదల నమోదైంది. త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండడం, అమెరికాలో ప్రైమ్ సభ్యత్వ ధరలను పెంచుతామన్న ప్రకటనల నేపథ్యంలోనే సంస్థ షేర్ విలువ పెరిగిందని నిపుణులు అంటున్నారు. ఇదిలావుంటే మదుపరులు ఆకర్షణీయమైన సేవల జోలికి వెళ్లడం లేదని, దీంతో ఫేస్ బుక్ రెవెన్యూ (రాబడి) పెరుగుదల తక్కువగా ఉండే అవకాశం ఉందని ‘మెటా’ వెల్లడించింది. గురువారం సంస్థ షేర్ విలువ 26 శాతం పడిపోయి.. 23,200 కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవలి కాలంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ ఐఎన్ సీ షేర్లు బాగా లాభపడుతున్నాయి. ఆయా సంస్థల నిర్ణయాలతో ఎస్ అండ్ పీ 500 సూచీలో ఎత్తుపల్లాలు నమోదవుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa