ప్రకాశం జిల్లాలో ఇవాళ రహదారి రక్తదాహానికి పలువురు బలయ్యారు. మోక్షగుండం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. గిద్దలూరు నుంచి మిర్చి లోడుతో గుంటూరు వెళుతున్న డీసీఎంను ఓ మినీ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ ట్రాలీలో ఉన్న 6 ఆవులు కూడా మృత్యువాతపడ్డాయి. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద ఘటన స్థలిలో దృశ్యాలు బీభత్సంగా ఉన్నాయి. రెండు వాహనాలు వేగంగా వస్తుండడంతో ఇంజిన్ క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో వ్యక్తులతో పాటు మూగ జీవాలు కూడా మరణించడం కలచివేసింది. కాగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa