శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారి అశీస్సులతో మోపిదేవి మండలం టేకుపల్లి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ప్రతిష్టా మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం రాళ్ళపల్లి ఆంజనేయ శాస్త్రి బ్రహ్మత్వంలో జరిగింది. ఈ ప్రతిష్ఠా మహోత్సవము వెంపటి వీరభద్ర కుటుంబ శాస్త్రి - జయలక్ష్మి దంపతుల కర్తుత్వంలో నిర్వహించారు. గురువారం ఉదయం 6. 30 గంటలకు ప్రాతఃసూక్త పారాయణ, గోపూజ, గణపతి పూజ, పుణ్యాఃవాచన, గర్తౌదిన్యాసములు
ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, నేత్రోన్మీలనము, సువర్ణం, అగ్ని, గో, దర్పణ, ఫల దర్శనం, ప్రాణ ప్రతిష్ఠాధి కళాన్యాసములు, పూర్ణాహుతి, మంటపోద్వాసన, కుంభోదక మార్జన అవబృధం, శాంతి కళ్యాణ మహోత్సవము దంపతులకు భక్తులకు మహదాశీర్వచనము, పండిత సత్కారము, మంగళ హారతితో ఈ కార్యక్రమాలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో ప్రతిష్టాకర్తలు వెంపటి వీరభద్ర కుటుంబశాస్త్రి, జయలక్ష్మి దంపతులు, ఆలయ ధర్మకర్త యడవల్లి నీల లోహిత శాస్త్రి, ఉషా హైమవతి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులైన వేమూరి నాగేశ్వర శర్మ, పద్మ దంపతులు, శ్రీ అద్దేపల్లి రామేశ్వర్, పద్మలత దంపతులు, శ్రీ నిమ్మగడ్డ శ్రీధర్, ఆలయ స్థానాచార్యులు శ్రీ లంకా ప్రసాద్, అర్చకులు శ్రీ పిల్లలమర్రి శాస్త్రి, ప్రతిష్టాకర్తల బంధువులు, గ్రామస్ధులూ పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa