ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ జిల్లాలో దారుణం.. తనయుడు చేతిలో తండ్రి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 02:27 PM

విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నాతవరం మండలంలో మాధవనగరం గ్రామానికి చెందిన కాండ్రకోట అప్పన్న (65) కుమారుడు సత్తిబాబు కర్రతో బలంగా కొట్టడంతో మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు పోలీసులు అందించిన సమాచారం మేరకు మృతుడు కుమారుడు సత్తిబాబు పింఛను డబ్బులు కోసం తండ్రితో గొడవపడి కర్రతో కొట్టడంతో మృతి చెందాడని చెప్పారు. కాండ్ర కోట కొండయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ శేఖరం చెప్పారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa