ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త జిల్లాల ఏర్పాటుపై హోరెత్తుతున్న నిరసనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 03:26 PM

పచ్చిమ ప్రకాశం ప్రాంతంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి నిరసనల జోరు పెంచాయి.


రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసేందుకు కసరత్తు చేపట్టింది. ప్రకాశం జిల్లాను 12 నియోజకవర్గాలను విభజించి ఏడు నియోజకవర్గాలను కలిపి ప్రకాశం జిల్లాగా చేసేందుకు కార్యాచరణ రూపొందించింది.


ఈ ప్రకటనపై ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిరసనలకు తెరలేపింది. ముఖ్యంగా పచ్చిమ ప్రకాశం ప్రాంతం ప్రజలు జిల్లాను విభజించే విషయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పచ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లాగా ప్రకటించాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అన్ని సంఘాలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఇక వామపక్ష పార్టీలతో కలిసి జేఏసీగా ఏర్పడి నిరసనల జోరు పెంచారు.


ముఖ్యంగా గిద్దలూరు ప్రాంత ప్రజలు జిల్లా విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మార్కాపురం జిల్లాగా ప్రకటించాల్సి ఉంది అంటూ ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి పెంచారు. మొదలు కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.


మన ప్రాంతాన్ని జిల్లాగా ఆమోదించుట లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అధికార పక్షం నేతలు జిల్లాపై ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. సూచన ప్రాయంగా పార్టీ పెద్దలకు మా ప్రాంత ప్రజలు జిల్లాగా కావాలని కోరుకుంటున్నారని మాత్రమే తెలిపామని చివరి నిర్ణయం సీఎం జగన్ దే అని అంటున్నారు.


స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అయినా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేక పోయిందని పచ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి జిల్లాను సాధించుకునేందుకు కృషి చేద్దామని నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కొన్ని ప్రాంతాలలో ఏకంగా అర్ధనగ్న ప్రదర్శనలు చేసేస్తూ మార్కాపురం జిల్లాగా ప్రకటించాల్సి ఉంది అంటూ డిమాండ్ చేస్తున్నారు.


మరి ఇవన్నీ గమనిస్తున్న ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, పార్టీ పెద్దలకు ఈ ప్రాంత ప్రజల మనోగతాన్ని ఏ విధంగా వెల్లడిస్తారో ఈనెల 26వ తేదీ వరకు వేచి చూడవలసిందే.


ఏది ఏమైనా పచ్చిమ ప్రకాశం ప్రాంతం అభివృద్ధిలో వెనుకబాటు గురైన విషయ ఈ ప్రాంత ప్రజలను కలచివేస్తుంది. పచ్చిమ ప్రకాశం ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మార్కాపురం జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించక తప్పలేదు.


మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో అసలు పచ్చిమ ప్రకాశం వాసుల మనోగతాన్ని అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa