భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కట్టుకున్న భర్తే కాలయముడు అయ్యాడు. భార్య గొంతు కోసి పోలీసులకు లొంగిపోయాడు. గుడిపల్లె మండలం కనమనపల్లె గ్రామానికి చెందిన మురుగేష్ శ్రీదేవీలకు 5 సంవత్సరల క్రితం వివాహం అయ్యింది. శ్రీదేవిపై మురుగేష్ కు అనుమానం రావడంతో వారం రోజులుగా ఇంట్లో గొడవలు జరరుగుతోంది. ఈ క్రమంలో మురుగేష్ కోపం కట్టలు తెంచుకుని భార్య గొంతుపై కత్తితో దాడి చేసాడు. శ్రీదేవి అరుపులకు స్థానికులు చేరుకుని శ్రీదేవిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa