ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. భార్య తలతో వీధుల్లో ప్రత్యక్షం

international |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 04:22 PM

ఓ వ్యక్తి తన భార్య తలను నరికేసి, దానితో వీధుల్లో తిరిగిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అమానుష ఘటన ఇరాన్‌లో సోమవారం జరిగింది. ఆ దేశంలోని అహ్వాజ్‌ నగరంలో మోనా హీదారీ (17) అనే యువతిని ఆమె భర్త, బావమరిది హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య అనంతరం తన భార్య తలతో సదరు కిరాకత భర్త వీధుల్లో తిరగడం ప్రపంచాన్ని నివ్వెరబోయేలా చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ దేశంలో ఈ ఘటనపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీనిపై ఇరాన్ మహిళా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ ఎన్సీ ఖాజాలీని స్పందించారు. ఘటనపై అత్యవసర చర్యలు తీసుకోవాలని, అటువంటి కేసులను నిరోధించడానికి అధికారులు అవగాహన కల్పించాలని ఆ దేశ పార్లమెంటును కోరారు. తాజాగా హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హీదారీ హత్య తర్వాత, గృహ హింసకు వ్యతిరేకంగా మహిళల రక్షణ కోసం చట్టాలను సంస్కరించాలని, మహిళలకు వివాహ వయసు పెంచాలనే డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇరాన్‌లో అమ్మాయిలకు వివాహ వయసు 13 ఏళ్లుగా నిర్ణయించబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa