ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్‌ ఆంక్షలపై సీఎం జగన్‌ అసంతృప్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 04:27 PM

విశాఖలో బుధవారం తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలపై సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్‌ను ఎందుకు నిలిపేశారని.. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని అధికారులపై సీరియస్‌ అయ్యారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌ జామ్‌తో పాటు ప్రజలకు ఇతర అసౌకర్యాలపై విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారు. బుధవారం విశాఖ శారదా పీఠాన్ని సీఎం జగన్‌ సందర్శించారు. సుమారు మూడున్నర గంటలపాటు అక్కడే ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నంతసేపు పోలీసులు ట్రాఫిక్‌ నిలిపేశారు. దీంతో పలు మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మద్యం దుకాణం మినహా అన్ని షాపులను మూసేయించారు. ఫలితంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులు పడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa