ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 05:04 PM

భారత  స్టాక్ మార్కెట్లు నేడు లాభాల తో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు లాభపడి 58,926 వద్ద ముగిసింది. నిఫ్టీ 142 పాయింట్లు లాభపడి 17,606కు చేరుకుంది. వినియోగ వస్తువుల సూచీ మినహా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
టాటా స్టీల్ (2.11%), ఇన్ఫోసిస్ (1.80%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.77%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (1.64%) మరియు కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.60%).
టాప్ లూజర్స్:
మారుతీ సుజుకి (-1.64%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.42%), నెస్లే ఇండియా (-0.38%) మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.21%). 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa