ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్నాడును జాషువా జిల్లాగా ప్రకటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 09:04 AM

గుంటూరు: జిల్లాల పునర్విభజన లో భాగంగా నరసరావుపేట జిల్లాను పల్నాడు జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం వెంటనే పల్నాడు జిల్లాని జాషువా పల్నాడు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ జాషువా పల్నాడు జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ హోంమంత్రి మంత్రి మేకతోటి సూచరితకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతం లో పుట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొని కేంద్ర సాహిత్య అకాడమీ మరియు పద్మ భూషణ్ లాంటి ఉన్నత పురస్కారాలను అందుకొని సాహిత్య శిఖరం గా ఎదిగి తెలుగు ప్రజల మనస్సుల్లో నిలిచి పోయిన విశ్వనరుడు గుర్రం జాషువా పేరుతో జిల్లాను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గుర్రం జాషువా లాంటి మహనీయుని పేరు ప్రతిపాదించడం చాలా మంచి విషయమని, తన వంతు కృషి చేస్తానని సుచరిత హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa