విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో రగిలిపోయిన తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు పంచాయతీ పరిధిలోని జడపల్లిమోటు తండాలో చోటుచేసుకొంది. తండావాసులు, పోలీసుల కథనం ప్రకారం. జడపల్లిమోటు తండా ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇసుకపల్లి శ్యాంసన్ ఓ విద్యార్థిని పట్ల బుధవారం అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు తెలిపింది.
దీంతో తండా వాసులు, తల్లిదండ్రులు కలిసి గురువారం పాఠశాల వద్దకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీశారు. అదే సమయంలో తరచూ పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మరికొందరు బాలికలు చెప్పడంతో తల్లిదండ్రుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అతడిని ఆ పాఠశాల గదిలోకి తీసుకెళ్లి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. అచ్చంపేట ఎస్‌ఐ సీహెచ్. మణికృష్ణ అక్కడికి చేరుకొని ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa