ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 10:07 AM

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడిగా ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందునే ప్రభుత్వం ఆయనపై కక్షకట్టిందన్నారు. సర్వీస్‌ విషయంలో తప్పుడు కేసు పెట్టి అశోక్‌ బాబును అరెస్టు చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని, చేసిన ప్రతి తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. కాగా ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు అశోక్‌ బాబును గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.


అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే ఆయన బీకాం డిగ్రీ చదవకపోయినా చదివినట్లు తప్పుడు పత్రాలు సమర్పించారని, మరికొన్ని ఆరోపణలతో విజయవాడకు చెందిన మెహర్ కుమార్ లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశాడు. లోకాయుక్త విచారణ జరిపి వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకుంది. సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ గీతామాధురి ఇటీవల అశోక్ బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 477 ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెలలో అశోక్ బాబుపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa