కర్ణాటకలో హిజాబ్ వివాదంతో మూతపడిన 9, 10 తరగతులను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించాలని బొమ్మై ప్రభుత్వం నిర్ణయించింది. హిజాబ్ వివాదంతో కర్ణాటక ప్రభుత్వం 9, 10 తరగతులకు మూడురోజులపాటు సెలవులు ప్రకటించింది. అయితే ఒకటి నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలు యధావిధిగా పనిచేస్తున్నాయి. 11, 12తరగతుల ప్రారంభంపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం ఉన్నత విద్య కశాళాలలు, విశ్వవిద్యాలయాల గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. ఉడుపిలో మొదలైన వివిధ మతాలకు చెందిన విద్యార్థినులు కాషాయ కండువాలు, హిజాబ్ ధరించి ప్రదర్శన నిర్వహించటంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలి కర్ణాటక సీఎం బొమ్మై ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa