ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీ సేన సఫారీ పర్యటన షెడ్యూల్‌ ఇదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 28, 2017, 11:16 AM

ఏడాది చివర్లో కోహ్లీ సేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా బోర్డు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ వివరాలను వెల్లడించింది. డిసెంబరు 30న దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో కోహ్లీ సేన వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 5న ఇరు జట్ల మధ్య కేప్‌టౌన్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. డిసెంబరు 30న ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌ సుదీర్ఘకాలం పాటు సాగి ఫిబ్రవరి 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేన ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.


టెస్టు షెడ్యూలు 


మొదటి టెస్టు: జనవరి 5 నుంచి 9 వరకు. వేదిక: కేప్‌టౌన్‌ 


రెండో టెస్టు: జనవరి 13 నుంచి 17 వరకు. వేదిక: సెంచూరియన్‌ 


మూడో టెస్టు: జనవరి 24 నుంచి 28 వరకు. వేదిక: జోహన్స్‌బర్గ్‌


వన్డే షెడ్యూలు 


తొలి వన్డే: ఫిబ్రవరి 1, డర్బన్‌ 


రెండో వన్డే: ఫిబ్రవరి 4, సెంచూరియన్‌ 


మూడో వన్డే: ఫిబ్రవరి 7, కేప్‌టౌన్‌ 


నాలుగో వన్డే: ఫిబ్రవరి 10, జోహన్స్‌బర్గ్‌ 


ఐదో వన్డే: ఫిబ్రవరి 13, పోర్ట్‌ ఎలిజబెత్‌ 


ఆరో వన్డే: ఫిబ్రవరి 16, సెంచురియన్‌


టీ20 షెడ్యూల్‌ 


తొలి టీ20: ఫిబ్రవరి 18, జోహన్స్‌బర్గ్‌ 


రెండో టీ20: ఫిబ్రవరి 21, సెంచూరియన్‌ 


మూడో టీ20: ఫిబ్రవరి 24, కేప్‌టౌన్‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa