సిగరెట్లతో పాటు వివిధ రకాల పొగాకు ఉత్పత్తులపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిగరెట్లు, బీడీలు, పొగాకు ఉత్పత్తులను విడిగా విక్రయించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ధూమపానాన్ని నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. విడిగా సిగరెట్లను విక్రయిస్తుండటమే బహిరంగ ధూమపానానికి కారణమని ఓ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పొగాకు నమలడంపై కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆదేశాల ప్రకారం... సిగరెట్లను పెట్టెగానే విక్రయాలి. విడిగా అమ్మడం కుదరదు. విడిగా విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa