ఇక గంటల తరబడి పెట్రోల్ బంకుల్లో ఎదురుచూడాల్సిన పనిలేదు. త్వరలోనే పెట్రోల్, డిజీల్ విక్రయాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఆన్‌లైన్‌లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలను చేపట్టడం వల్ల ఇంటికే ఇంధనాన్ని పంపిణీ చేయడంతో పాటు పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గించే అవకాశం కూడా కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఆన్‌లైన్ విక్రయ సంస్థలను సంప్రదించినట్లు ఆయన తెలియజేశారు. దేశంలో ఉన్న నాలుగు కోట్ల మంది వినియోగదారులకు కేవలం లక్ష రిటైల్ ఔట్‌లెట్లే ఉన్నాయని ప్రధాన్ గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa