కర్ణాటక రాష్ట్రంలో తలెత్తిన హిజాబ్ వివాదం..దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్న దోరణులపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దేశమా? మతమా? .. ఏది అత్యున్నతమైందంటూ ప్రశ్నించింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం తీవ్రమైన సమయంలోనే.. ఆలయాల్లోకి హిందూయేతరులను నిషేధించాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ భండారీ, జస్టిస్ డీ భరత్ చక్రవర్తిలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కొన్ని శక్తులు డ్రెస్ కోడ్‌కు సంబంధించిన వివాదాలను లేవనెత్తుతున్నాయనీ, ఇది దేశమంతా పాకుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది. ఒకరు హిజాబ్ కోసం, మరికొందరు టోపీ కోసం.. ఇంకొందరు ఇతర అంవాల కోసం వెళ్తున్నారు. ఇది ఒక దేశమా? లేదంటే మత ప్రాతిపదికన విభజించబడిందా? జరుగుతున్న పరిణామాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. భారతదేశం లౌకిక దేశమనే వాస్తవాన్ని గుర్తుకోవాలన్నారు యాక్టింగ్ సీజే భండారీ. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు మతం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం తప్ప మరోటి కాందన్నారు. తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన రంగరాజన్ నరసింహన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా సీజే ఈ మేరకు వ్యాఖ్యానించారు. తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్‌ను ఖచ్చితంగా అమలు చేయాలంటూ పిటిషనర్ కోర్టును కోరారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లోకి హిందూయేతరులు అడుగుపెట్టకుండా, దేవాలయాల ప్రాంగణంలో వాణిజ్య కార్యకలాపాలను నిషేధించాలంటూ ఆదేశిలివ్వాలని కోరారు. పిటిషనర్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం అంతేగాక, దేవాలయాల ప్రవేశ హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ డ్రెస్ కోడ్ ను నిర్దేశిస్తూ డిస్ ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లేనప్పుడు వాటిపై డిస్ ప్లే బోర్డులు పెట్టడమోలా అనే ప్రశ్న తలెత్తుతుందని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే, పిటిషనర్ తీర్పు కోసం పట్టుదలతో తన అభ్యర్థనను తగిన ఆధారాలు సమర్పించాలని కోర్టు సూచించింది. ప్యాంటు, ధోతీ చొక్కాలను ధరించాలని ఏ ఆగమ శాస్త్రం సూచిస్తోందని ప్రశ్నించింది. అంతేగాక, పిటిషనర్ దోరణిపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, కర్ణాటకలో హిజాబ్ వ్యవహారానికి కర్ణాటక కోర్టు ముగింపు పలికిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa