ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్విట్టర్ యూజర్లకు షాక్

national |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 08:24 AM

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సేవలకు శుక్రవారం రాత్రి అంతరాయం ఏర్పడింది. భారత్​ సహా పలు దేశాల్లో దాదాపు గంట పాటు ట్విట్టర్ సేవలు నిలిచిపోయయి. ట్విట్టర్​లో పోస్టింగ్ చేసేందుకు, సెర్చింగ్ చేయడానికి ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున యూజర్లు సంస్థకు ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. ఈ సమస్య రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై గంట పాటు వేధించిందని డౌన్​ డిటెక్టర్​ అనే వెబ్​సైట్ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా యూజర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో ట్విట్టర్ సంస్థ స్పందించింది. సమస్యను పరిష్కరించామంటూ 11.44 గంటలకు సంస్థ నుంచి ట్వీట్​ వచ్చింది. సమస్యకు టెక్నికల్​ బగ్​ కారణంగా సేవలలో అంతరాయం ఏర్పడిందని, క్షమించాలని యూజర్లను కోరింది. ట్విట్టర్​ సేవలు పున:ప్రారంభమయ్యాక కూడా యూజర్లు ఈ సమస్యపై వదిలిపెట్టలేదు. 'ట్విట్టర్​ డౌన్'​ అనే హ్యాష్​ట్యాగ్‌ను నెటిజన్లు వైరల్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa