అనిల్ అంబానీకి సెబీ షాకిచ్చింది. సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా శుక్రవారం నిషేధం విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌తో మరో ముగ్గురిపై సెబీ ఈ కఠిన చర్యలు తీసుకుంది. కంపెనీలలో మోసపూరిత చర్యలు జరిగాయని సెబీ పేర్కొంది. దీంతో అమిత్ బప్నా, రవీంద్ర సుధాకర్, పింకేశ్ ఆర్ షాలని నిషేధిత జాబితాలో చేర్చారు. ఏ లిస్టెడ్ కంపెనీతో కానీ, పబ్లిక్ కంపెనీకి చెందిన డైరెక్టర్లు, ప్రమోటర్ల నుంచి నిధులు సమీకరించొద్దని సూచించింది. తదుపరి ఆదేశాలొచ్చే వరకు తమ ఉత్తర్వులు అమలులో ఉంటాయని సెబీ పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈతో పాటు ఆ ఎక్స్ఛేంజీ మాజీ ఎండీ, సీఈఓలకు సెబీ జరిమానా విధించింది. చిత్రా రామకృష్ణకు రూ.3 కోట్లు, రవి నారాయణ్‌కు రూ.2 కోట్లు జరిమానా వేసింది. నిబంధనల ఉల్లంఘనలపై సెబీ తీసుకున్న నిర్ణయంతో వ్యాపారవేత్తలకు షాక్ తిన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa