చెన్నై-గూడూరు సెక్షన్‌లో సాంకేతిక పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైలు నెంబరు 12711-12712 విజయవాడ-చెన్నైసెంట్రల్ రైలు గూడూరు-చెన్నై మధ్య రద్దు(22వ తేదీన) నెంబరు 06746-06745 నెల్లూరు-సూళ్లూరుపేట మెము రైలు(22న పూర్తిగా రద్దు) నెంబరు 22403 పుదుచ్చేరి-న్యూదిల్లీ రైలు ఈ నెల 16న చెంగలపట్టు, పెరంబూర్ మీదగా దారి మళ్లింపు, నెంబరు 22645 ఇండోర్-కొచివెల్లి రైలు ఈ నెల 21న గూడూరు, రేణిగుంట మీదుగా మళ్లింపు, నెంబరు 13351 దన్‌బాద్-అలెప్పి ఈ నెల 21న గుంటూరు-రేణిగుంట మీదుగా మళ్లింపు, నెంబరు 17644 కాకినాడ-చెంగలపట్టు ఈ నెల 26న పెరంబూర్ మీదుగా మళ్లింపు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa